: తెలుగు సినీ పరిశ్రమ దోష నివారణకు చేపట్టిన మహా మృత్యుంజయ హోమం!


గత కొంతకాలంగా వరుసబెట్టి సినీ ప్రముఖులు చనిపోవడంతో, దోష నివారణకు చేపట్టిన మహా మృత్యుంజయ హోమం ఈ ఉదయం ప్రారంభమైంది. ఫిలింనగర్ లోని దైవ సన్నిధానంలో హోమ క్రతువు నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి దగ్గరుండి హోమాన్ని ప్రారంభించారు. మహా మృత్యుంజయ హోమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ హోమం మూడు రోజులపాటు కొనసాగనుంది. గడచిన ఏడాదిన్నర వ్యవధిలో పలువురు సినీ పెద్దలు మరణించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News