: ‘మా’ కార్యవర్గంలో మంచు లక్ష్మీప్రసన్న... ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవ ఎన్నిక
వెండితెరపైనే కాక బుల్లితెరపైనా సందడి చేస్తున్న మంచు వారి అమ్మాయి లక్ష్మీప్రసన్న టాలీవుడ్ లో మరింత క్రియాశీల భూమిక పోషించనున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో భాగంగా ఆమె ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నటుడు శివకృష్ణ, మంచు లక్ష్మీ ప్రసన్న మా ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అసోసియేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక అధ్యక్ష పదవి కోసం సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, జయసుధల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ నెల 29న ఈ పదవికి సంబంధించిన ఓటింగ్ జరగనుంది.