: తిరుమల శ్రీవారి హుండీలో చెయ్యి పెట్టాడు... బుక్కయ్యాడు!


దేవదేవుడికే మస్కా కొడదామని ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగింది. సుధాకర్‌ నాయుడు అనే వ్యక్తి మొబైల్‌ హుండీలో చోరీ చేశాడు. మొత్తం 17,300 రూపాయలను నాయుడు అపహరించాడు. దీన్ని గమనించిన టీటీడీ భద్రతా సిబ్బంది దొంగను అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ అధికారుల ఆదేశాల మేరకు చోరీ వ్యవహారంపై భద్రతా సిబ్బంది విచారణ జరుపుతున్నారు. సుధాకర్ నాయుడు ఎక్కడినుంచి వచ్చాడు? గత చరిత్ర ఏమిటి? అనే దిశగా విచారణ సాగుతున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News