: సానియా మీర్జాకు ఫరాఖాన్ అభినందన
బీఎన్ పీ పరిబాస్ టెన్నిస్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్ సాధించిన సానియా మీర్జాకు బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ అభినందనలు తెలిపారు. మార్టినా హింగిస్ తో జోడీ కట్టిన సానియా ఫైనల్లో 6-3, 6-4తో ఎక్తెరినా మకరోవా, ఎలెనా వెస్నీనా జోడీపై సునాయాసంగా నెగ్గింది. దీంతో, సానియాను విశేషంగా అభిమానించే ఫరా వెంటనే ట్వీట్ చేసింది. ఆమెకు అభినందనలు తెలిపింది. 'ఆహా ఏం రోజు! కంగ్రాట్స్ బేబీ... నువ్వు వండగలవు, ఆడగలవు' అని సానియాకు కితాబిచ్చింది.