: ముస్లింలు, క్రైస్తవులపై హిందుత్వవాదులు విషం చిమ్ముతున్నారు: ముస్లిం పర్సనల్ లా బోర్డు


ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నరేంద్ర మోదీ సర్కారుపై దాడికి దిగింది. మోదీ సర్కారు దేశంలోని ముస్లింలలో అభద్రతా భావాన్ని రేకెత్తిస్తోందని ఆరోపించింది. ఆర్ఎస్ఎస్ వంటి హిందుత్వ సంస్థలు దేశాన్ని ఫాసిస్టు దేశంగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించింది. ఇటీవల కేంద్రం, కొన్ని రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలు, వీహెచ్ పీ, ఆర్ఎస్ఎస్ నేతల విద్వేషపూరిత ప్రసంగాలు ముస్లింలను న్యూనతా భావానికి గురిచేస్తున్నాయని ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ రహీమ్ ఖురేషి తెలిపారు. సూర్య నమస్కారాలను తప్పనిసరి చేయడం తమ మత విశ్వాసాలకు వ్యతిరేకమని అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక హిందుత్వ శక్తులు మరింత బలపడ్డాయని విమర్శించారు. ఘర్ వాపసీ పేరిట హిందుత్వ వాదులు ముస్లింలపై, క్రైస్తవులపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News