: ఆచారం పేరిట పిడకలతో కొట్టుకున్నారు!
ఆచారాల పేరిట జరిగే విచిత్రమైన పోరాటాలు కొన్ని ప్రాంతాల్లో మనం నేటికీ చూడొచ్చు. కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే బన్ని ఉత్సవం, ఇదే జిల్లాలోని కైరుప్పలలో జరిగే పిడకల సమరం ఈ కోవలోకే వస్తాయి. నేడు కైరుప్పలలో పిడకల సమరం నిర్వహించారు. గ్రామస్థులు వీరభద్రస్వామి, కాళికాదేవి వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకున్నారు. అనంతరం కాళికాదేవికి, వీరభద్రస్వామికి కల్యాణం చేశారు. ఇది చూసేందుకు సమీప ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. కాగా, పిడకల దాడిలో 10 మందికి గాయాలయ్యాయి.