: భారత్ సెమీస్ చేరడంతో విమాన టికెట్ల ధరలకు రెక్కలొచ్చాయి!
వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ చేరడం తెలిసిందే. ఈ నెల 26న సిడ్నీలో జరిగే సెమీస్ సమరంలో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో, విమానయాన సంస్థలు టికెట్ల ధరలు పెంచేశాయి. భారత్ లోని మెట్రో నగరాల నుంచి ఆస్ట్రేలియా నగరాలు మెల్బోర్న్, సిడ్నీలకు ప్రయాణం చేయాలంటే 15 నుంచి 20 శాతం అధిక ధర చెల్లించాల్సిందే. సిడ్నీలో రెండో సెమీఫైనల్ జరగనుండగా, మెల్బోర్న్ వరల్డ్ కప్ ఫైనల్ కు ఆతిథ్యమిస్తోంది. కాగా, భారత్ సెమీఫైనల్లో కంగారూలను చిత్తుచేసి ఫైనల్ చేరితే టికెట్ల ధరలు మరింత పెరిగే అవకాశముందని ట్రావెల్ సంస్థ 'యాత్రా' అధ్యక్షుడు శరత్ ధాల్ అంటున్నారు.