: ఆ ప్రశ్నకు గాంధీ పేరు చెబుతారు... ఈ ప్రశ్నకు రామానాయుడు పేరు చెబుతారు: దాసరి


హైదరాబాదులో జరిగిన రామానాయుడు సంస్మరణ సభలో సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు మాట్లాడారు. రామానాయుడుతో తనకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. ఆయనది పసివాడి మనస్తత్వమని అన్నారు. సహజమైన మనిషి అని, నేలపై పుట్టిన వ్యక్తి నేల విడిచి సాము చేయకుండా నేలపైనే నిలుచుంటే అది రామానాయుడు అవుతాడని అభివర్ణించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది ఎవరంటే గాంధీ పేరు చెబుతారని, తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాత ఎవరంటే రామానాయుడి పేరే చెబుతారని అన్నారు. సినీ రంగానికి పెద్ద బాలశిక్షలా, దిక్సూచిగా రామానాయుడి పేరు చెప్పుకోవచ్చని అన్నారు. ఆయన నిజమైన నిర్మాత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అనేకమంది సినిమా పెద్దలు పాల్గొన్నారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా కార్యక్రమానికి విచ్చేశారు.

  • Loading...

More Telugu News