: పాక్ కు హెచ్చరికలు జారీ చేసిన ముఫ్తీ... తీరు మార్చుకున్నాడా?


జమ్మూకాశ్మీర్ సీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే, రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కారణం పాకిస్థాన్, ఉగ్రవాదులేనని ముఫ్తీ మహ్మద్ సయీద్ చేసిన వ్యాఖ్యలు ఎంతో దుమారం రేపాయి. దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రాష్ట్రంలో ముఫ్తీ పార్టీ పీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కూడా ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, ఆయన తన తీరును మార్చుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా పాక్ పై విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కాశ్మీర్లోని పోలీస్ క్యాంపులపై ఉగ్రవాదులు తాజాగా దాడులకు దిగడాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసే కుట్ర ఇదని ముఫ్తీ పేర్కొన్నారు. నిజంగా పాక్ శాంతిని కోరుకుంటున్నట్టయితే, ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ టెర్రరిజాన్ని, ఉగ్రవాదులను నియంత్రించాలని అన్నారు.

  • Loading...

More Telugu News