: పాట పాడిన మహారాష్ట్ర సీఎం అర్ధాంగి


మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత సేవ్ గాళ్ చైల్డ్ ప్రచారంలో భాగంగా భ్రూణ హత్యలను నిరసిస్తూ ఓ గీతం ఆలపించారు. 'తిలా జాగు ద్యా' (ఆమెను బతకనివ్వండి) అంటూ మరాఠీలో సాగే ఆ పాట రికార్డింగ్ పూర్తయింది. తనకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే అమిత ఇష్టమని, పైగా, సామాజిక చైతన్యం కోసం పాడమని కోరడంతో వెంటనే అంగీకరించానని అమృత తెలిపారు. తన వివాహం తర్వాత కూడా అనేక ప్రైవేటు ఫంక్షన్లలో పాడానని చెప్పారు. అయితే, ఓ స్టూడియోలో పాటను రికార్డు చేయడం ఇదే తొలిసారి అని వెల్లడించారు. అమృత ప్రస్తుతం యాక్సిస్ బ్యాంకులో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. తన ఐదేళ్ల కుమార్తె దివిజను తలుచుకుని పాడానని ఆమె తెలిపారు. పాట పాడిన విషయం భర్తకు తెలుపగా, సామాజిక సేవను కొనసాగించమని చెప్పారని అమృత పేర్కొన్నారు. శ్రీరంగ్ ఉర్హేకర్ స్వరపరిచిన ఈ గీతాన్ని ప్రజక్త పట్వర్థన్ రచించారు.

  • Loading...

More Telugu News