: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్


ఉభయ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొన్ని ఘటనల మినహా ప్రశాంతంగానే ముగిసింది. ఈ సాయంత్రం 4 గంటల తర్వాత క్యూ లైన్లలోకి ఎవరినీ అనుమతించడం లేదు. అప్పటికి క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు. ఈ నెల 25న ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలో రెండు పట్టభద్రుల స్థానాలకు, ఏపీలో రెండు ఉపాధ్యాయ స్థానాలకు నేడు పోలింగ్ జరిగింది. విజయవాడలో టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ వామపక్ష కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడ తోపులాట చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News