: పార్లమెంటు ఆవరణలో అగ్నిప్రమాదం... దట్టంగా అలముకున్న పొగలు


పార్లమెంటు ఆవరణలో ఈ మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. విజిటర్స్ ఎంట్రన్స్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ ప్లాంట్ పవర్ హౌస్ లో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో, ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం 7 ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భద్రతా బలగాలు ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు.

  • Loading...

More Telugu News