: ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే చరిత్రహీనులుగా నిలుస్తారు: నేతలకు సినీ హీరో శివాజీ వార్నింగ్
ప్రజలను మోసపూరిత ప్రకటనలతో మభ్యపెట్టాలని చూస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని రాజకీయ పార్టీలు, నేతలను సినీ హీరో, బీజేపీ నేత శివాజీ హెచ్చరించారు. ఇకనైనా మోసపూరిత, మభ్యపెట్టే ప్రకటనలు జారీ చేయడం మానుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఆయా పార్టీలు, నేతలు కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. అమలు చేయగలిగే హామీలను మాత్రమే ఇవ్వాలన్నారు. ఏపీకి ఈ నెలాఖరుకు కేంద్రం రూ.10 వేల కోట్ల నిధులను విడుదల చేస్తుందని ప్రకటించిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, సదరు నిధులను ఎందుకోసం విడుదల చేస్తున్నారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.