: ఆర్టీసీ బస్సుల్లో నల్లులు... విచారణకు ఆదేశించిన ఏపీ రవాణా మంత్రి
ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో నల్లులు ప్రయాణికులను ఓ రేంజిలో ఇబ్బందులు పెడుతున్నాయట. దీనిపై తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావుకు ఓ ఫిర్యాదు అందింది. సదరు ఫిర్యాదులో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన పాపానికి తనను నల్లులు ఎలా కుట్టి, రక్తం పీల్చి, గాయాలు చేశాయో తెలియజేస్తూ ఫిర్యాదుదారుడు ఫొటోలను కూడా పంపాడు. దీంతో, సదరు ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన శిద్ధా, వాస్తవ పరిస్థితులేమిటో తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక, బస్సుల్లో నల్లుల నివారణకు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీసుకుంటున్న చర్యలను రాష్ట్రంలోనూ అమలు చేయాలని ఆదేశించారట. మంత్రిగారి ఆదేశాలతో ఆర్టీసీ అధికారగణం ఆగమేఘాలపై కదిలింది. మరి వీరి చర్యలకు నల్లులు పరారవుతాయో, లేదో చూడాలి.