: ఓ పక్కన పోలింగ్... మరో పక్కన మద్యం విక్రయాలు: పిఠాపురంలో ఎన్నికల కోడ్ కు తూట్లు


తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయితే, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో మాత్రం కొందరు సదరు కోడ్ ను యథేచ్ఛగా అతిక్రమిస్తున్నారు. నేటి ఉదయం పోలింగ్ ప్రారంభం కాగా, పట్టణంలో మధ్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల కోడ్ కారణంగా రెండు రోజులుగా మద్యం షాపులు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే, ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీలు బలపరచిన అభ్యర్థులు అక్రమ మార్గాల్లో మద్యం సరఫరా చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నేటి ఉదయం పిఠాపురంలో ఓ షాపు బహిరంగంగానే మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నా, పోలీసులు ఏమాత్రం పట్టించుకున్న పాపానపోలేదని తెలిసింది.

  • Loading...

More Telugu News