: నిలకడగా ఢిల్లీ అత్యాచార బాలిక ఆరోగ్యం
ఢిల్లీలో తాజాగా వెలుగుచూసిన అత్యాచార ఘటనలో తీవ్ర గాయాలకు గురైన ఐదేళ్ల బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యుడు వైకే గుప్తా తెలిపారు. చికత్సకు బాలిక స్పందింస్తోందని చెప్పారు. మొత్తం 8 మంది వైద్యుల బృందం పర్యవేక్షణలో చిన్నారికి వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. ఇన్ ఫెక్షన్లు సోకకుండా సెలైన్ల ద్వారా యాంటిబయాటిక్స్ అందిస్తున్నట్లు వివరించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలుపుతున్నామని వైద్యుడు చెప్పారు.
అటు ఈ ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందిస్తూ .. ముక్కుపచ్చలారని ఐదు సంవత్సరాల చిన్నారిపై జరిగిన ఈ హేయమైన ఘటన తనను కలచివేసిందని అన్నారు. బాధితురాలికి సత్వర న్యాయం అందించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రణబ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు.