: తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం ఓటు గల్లంతు... కొనసాగుతున్న పోలింగ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి భంగపాటు ఎదురైంది. ఓటరు జాబితాలో ఆయన పేరు గల్లంతైంది. గడచిన ఎన్నికల సందర్భంగా ఓటేశానన్న ఆయన, తన ఓటు గల్లంతవడంపై విస్మయం వ్యక్తం చేశారు. అయితే, ఓటు గల్లంతు వ్యవహారం తమ పరిధిలోకి రాదని పోలింగ్ సిబ్బంది చెప్పడంతో, ఓటు వేయకుండానే ఆయన వెనుదిరిగారు. నేటి ఉదయం వరంగల్ జిల్లా హన్మకొండలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదిలా ఉంటే, తెలంగాణలో పట్టభద్రులు, ఏపీలో ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.