: స్మగ్లింగ్ కట్టడికి ఇథియోపియా ఉక్కు సంకల్పం...రూ.80 కోట్ల విలువైన ఏనుగు దంతాలకు ఉప ప్రధాని నిప్పు


ఏనుగు దంతాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే విషయంలో ఇథియోపియా సమర శంఖం పూరించింది. అందులో భాగంగా ఎంతటి చర్యకైనా వెనుకాడేది లేదంటూ ప్రకటించింది. ఈ క్రమంలోనే స్మగ్లర్ల నుంచి పట్టుకున్న రూ.80 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాలను కాల్చి బూడిద చేసింది. 20 ఏళ్ల కాలంలో స్మగ్లర్ల నుంచి ఇథియోపియా అధికారులు ఈ దంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదివరకే ఏనుగు దంతాల అక్రమ రవాణాపై ప్రకటించిన కఠిన నిషేధాన్ని ఇకపైనా కొనసాగించడమే కాక ఉక్కుపాదం మోపుతామని తేల్చిచెప్పిన ఆ దేశ ఉప ప్రధాని డిమీక్ మెకోనెన్, పట్టుబడ్డ ఏనుగు దంతాలకు స్వయంగా నిప్పు పెట్టారు.

  • Loading...

More Telugu News