: రాజకీయాల్లో శూర్పణఖలు, తాటకిలు ఉన్నారు: బోండా ఉమ


మొన్న అసెంబ్లీ, నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు... ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులను వెదజల్లుతున్న అధికార పార్టీ, హోటళ్లలో ఉపాధ్యాయులకు విందులిచ్చిందని వైసీపీ బలపరచిన అభ్యర్థి తాడి శకుంతల ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం విజయవాడలోని ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, వైసీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బరి తెగించి మాట్లాడటం ఒక్క వైసీపీ నేతలకే చెల్లిందన్నారు. రాజకీయాల్లో శూర్పణఖలు, తాటకిలు ఉన్నారని ఆయన శకుంతల, వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News