: టీడీపీ అభ్యర్థికి వైసీపీ ‘టీచర్స్’ మద్దతు... ఆసక్తికరంగా ఏపీ ఎమ్మెల్సీ పోరు!
ఏపీలో కొద్దిసేపటి క్రితం మొదలైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. అధికార పార్టీ బలపరచిన రామకృష్ణకు ప్రతిపక్ష వైసీపీ మద్దతు కూడా లభించింది. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. టీడీపీ మద్దతుతో బరిలోకి దిగిన రామకృష్ణకు వైసీపీ ఉపాధ్యాయ విభాగం మద్దతు తెలిపింది. దీంతో ఆ పార్టీకి చెందిన ఓట్లన్నీ అధికార పార్టీ అభ్యర్థికే పడే అవకాశాలున్నాయి. ఈ ఊహించని పరిణామంతో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య నెలకొనాల్సిన పోటీ... టీడీపీ, యూటీఎఫ్ అభ్యర్థుల మధ్యకు మారింది. మరోవైపు ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని ఉపాద్యాయ ఎమ్మెల్సీ బరిలో త్రిముఖ పోటీ నెలకొంది. అక్కడ కూడా అదికార, విపక్షాలు బలపరచిన అభ్యర్థుల మధ్య పోటీ కాకుండా, ఉపాధ్యాయ సంఘాలు బలపరచిన అభ్యర్థుల మధ్య పోటీ రసవత్తరంగా మారింది.