: ఈ సారి నిజామాబాదు పోలీసుల వంతు... వన్ టౌన్ పీఎస్ లో లాకప్ డెత్!


మెదక్ జిల్లాలో పోలీసుల అకృత్యాలకు బలైన వ్యక్తి ఉదంతాన్ని మరువక ముందే, నిజామాబాదు పోలీసులు మరో వ్యక్తిని పొట్టనబెట్టుకున్నారు. విచారణ పేరిట స్టేషన్ కు తీసుకువచ్చిన సదరు వ్యక్తిని చితకబాదిన పోలీసులు, అతడి మృతికి కారకులయ్యారు. నగరంలోని వన్ టౌన్ పీఎస్ పోలీసులు ఓ కేసు విచారణ నిమిత్తం సాజిద్ అనే వ్యక్తిని నిన్న పోలీస్ స్టేషన్ కు పిలిచారు. అనంతరం విచారణ పేరిట అతడిని చితకబాదారు. పోలీసుల థర్డ్ డిగ్రీలో సాజిద్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాదుకు తరలిస్తున్న క్రమంలోనే సాజిద్ మృత్యువాతపడ్డాడు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News