: అట్టహాసంగా 'రుద్రమదేవి' ఆడియో రిలీజ్... హాజరైన సినీ దిగ్గజాలు


టాలీవుడ్ అగ్రనటి అనుష్క ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన సంచలన చిత్రం ‘రుద్రమదేవి’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ విశాఖలో కొద్దిసేపటి క్రితం అట్టహాసంగా ప్రారంభమైంది. సినీ దిగ్గజాలు హాజరైన ఈ కార్యక్రమానికి అనుష్కతో పాటు చిత్రంలోని నటీనటులు కూడా హాజరయ్యారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో పాటు దగ్గుబాటి రానా కీలక పాత్రలు పోషించారు. అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర చిత్రానికే హైలెట్ గా నిలవనుందని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.

  • Loading...

More Telugu News