: జగన్, కాంగ్రెస్ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు... నెలాఖరులోగా ఏపీకి నిధులు: సుజనా చౌదరి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఏపీ కాంగ్రెస్ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఏపీకి ప్రత్యేక హోదా, అదనపు నిధుల విడుదలలో కేంద్రం అలసత్వం ప్రదర్శిస్తోందన్న ఆ రెండు పార్టీల ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని సుజనా ఈ మధ్యాహ్నం హైదరాబాదులో పేర్కొన్నారు. నెలాఖరులోగా ఏపీకి నిధులు తప్పనిసరిగా అందుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోందని కూడా సుజనా వెల్లడించారు.