: పాక్ బౌలర్ వహాబ్, ఆసీస్ ఆల్ రౌండర్ వాట్సన్ గీత దాటారు... ‘కోత’కు గురయ్యారు!


వరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ల మధ్య జరగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో పాక్ బౌలర్ వహాబ్ రియాజ్ అసభ్య సంజ్ఞలు, మితి మీరిన దూషణలు ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించాయి. ఫ్యాన్స్ కే కాదండోయ్, మ్యాచ్ రిఫరీకి కూడా కోపం తెప్పించాయి. దీంతో దీనిపై సమగ్ర విచారణ చేసిన ఐసీసీ రిఫరీ రంజన్ మదుగలే... వివాదానాకి తెర తీసిన వహాబ్ తో పాటు, అంపైర్ మాటను కూడా కాదని అతడికి ఘాటుగానే బదులిచ్చిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ లపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరి మ్యాచ్ ఫీజుల్లో కోత విధించిన మదుగలే... వహాబ్ ఫీజులో సగానికి సగం కోత కోయగా, వాట్సన్ మ్యాచ్ పీజులో మాత్రం 15 శాతానికి కోతను పరిమితం చేశారు.

  • Loading...

More Telugu News