: గుంటూరులో విషాదం... కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం, పిల్లలిద్దరూ మృతి
గుంటూరులో ఉగాది పర్వదినాన విషాదం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని ఇద్దరు కూతుళ్లతో కలిసి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు చనిపోగా, మహిళ పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరులోని కొత్తపేటలో వెలుగుచూసిన ఈ ఘటనలో సంధ్య అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లు దుర్గ (7), ప్రియాంక (4)లకు పురుగుల మందు తాగించి, తానూ తాగింది. పిల్లలిద్దరూ మృత్యువాత పడ్డారు. అపస్మారక స్థితిలోని సంధ్యను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.