: బంగ్లా ప్రధాని షేక్ హసీనాదీ అదే మాట... బంగ్లాను ఓడించే సత్తా భారత్ కు లేదట!


వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ లో బంగ్లాదేశ్ జట్టు విజయాన్ని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్థానీ అంపైర్ అలీమ్ దార్ తప్పుడు నిర్ణయాల వల్లే తమ జట్టు ఓడిందని ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ వీధులెక్కి నిరసనలు తెలుపుతుంటే... ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారులతో పాటు పాలకులు కూడా వారి నిరసనలకు ఆజ్యం పోస్తున్నారు. నిన్నటికి నిన్న ఏకంగా ఐసీసీ అధ్యక్షుడి హోదాలో ముస్తఫా కమల్ నోరు పారేసుకుంటే, ఆయన మాటలే నిజమని సాక్షాత్తు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా కూడా వ్యాఖ్యానించారు. అంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్లే తమ జట్టు ఓటమిపాలైందని వ్యాఖ్యానించిన ఆమె, మరో అడుగు ముందుకేసి బంగ్లాను ఓడించే సత్తా టీమిండియాకు లేనే లేదని తేల్చిచెప్పేశారు. ఈ మేరకు ఆమె వ్యాఖ్యలను ‘టౌమ్స్ నౌ’ ప్రసారం చేసింది.

  • Loading...

More Telugu News