: ఎన్టీఆర్ జోలెపట్టి నిధులు సేకరించారు: కేఈ
అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాల్లో పడ్డప్పుడు దివంగత నందమూరి తారకరామారావు జోలె పట్టి నిధులు సేకరించారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గుర్తుచేశారు. రాయలసీమను అభివృద్ధి చేసేందుకు అనేక చర్యలు తీసుకున్నారని, పలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయనే కారణమని అన్నారు. కర్నూలులో కేఈ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రథమ పర్యాయం ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు కర్నూలు నుంచి తెలంగాణకు నీరిచ్చారని కొనియాడారు. చంద్రబాబు ఇప్పుడు కూడా నిస్వార్థంగా పనిచేస్తున్నారని ఆయన కీర్తించారు.