: భారత్, ఆస్ట్రేలియా సెమీస్ సమరానికి అంపైర్లు వీరే


క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, ఆస్ట్రేలియా సెమీస్ పోరు ఈ నెల 26న సిడ్నీలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఐసీసీ అంపైర్లను ప్రకటించింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన, ఇంగ్లండ్ కు చెందిన రిచర్డ్ కెటిల్ బరో వ్యవహరిస్తారు. మ్యాచ్ రిఫరీగా శ్రీలంకకే చెందిన రంజన్ మదుగళే బాధ్యతలు నిర్వర్తిస్తాడు. థర్డ్ అంపైర్ గా మరాయిస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా)ను ఎంపిక చేశారు. ఇక, ఈ నెల 24న ఆక్లాండ్ లో జరిగే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సెమీస్ మ్యాచ్ కు ఇయాన్ గౌల్డ్ (ఇంగ్లండ్), రాడ్ టకర్ (ఆస్ట్రేలియా) ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ బూన్ మ్యాచ్ రిఫరీగా, నైజెల్ లాంగ్ (ఇంగ్లండ్) థర్డ్ అంపైర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. కాగా, టోర్నీ ఫైనల్ ఈ నెల 29న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరగనుంది.

  • Loading...

More Telugu News