: స్వీట్లు పంచుకుంటున్న అభిమానులు... ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పండుగ వాతావరణం
టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులకు మగశిశువు జన్మనించడంతో నారా, నందమూరి అభిమానుల్లో ఆనందం పెల్లుబికింది. హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఉగాది పంచాంగ శ్రవణానికి హాజరైన నేతలు, కార్యకర్తలకు ఈ వార్త చెవినబడడంతో సంబరాలకు తెరదీశారు. నేతలు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అటు, చంద్రబాబు, బాలకృష్ణ బంధువర్గాలకు ఈ శుభవార్త తెలియడంతో వారు తల్లిదండ్రులుగా ప్రమోషన్ కొట్టేసిన లోకేశ్, బ్రాహ్మణిలకు శుభాకాంక్షలు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు.