: టీమిండియాపై యుద్ధభేరి మోగించిన మ్యాక్స్ వెల్


ఈ ఎండాకాలంలో ఆసీస్ గడ్డపై పర్యటనలో టీమిండియా ఒక్క మ్యాచ్ లోనూ విజయం సాధించకపోవడాన్ని కంగారూ డాషింగ్ బ్యాట్స్ మన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ప్రత్యేకంగా ఎత్తిచూపాడు. భారత్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించాడు. ఈ వేసవిలో భారత్ ను బాగా వేటాడామని, ఆ సందర్భంగా వారు ఏ మ్యాచ్ లోనూ నెగ్గలేదన్న విషయం గుర్తుండే ఉంటుందని అన్నాడు. ఆతిథ్య ఆస్ట్రేలియా వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియాతో తలపడాల్సి ఉండడంతో మ్యాక్స్ వెల్ ఈ విధంగా మానసిక యుద్ధానికి తెరదీశాడు. తాము టీమిండియాపై ఆధిపత్యం చెలాయించడం ఖాయమని చెప్పాడు. భారత్ కూడా మంచి జట్టే అని, బాగా ఆడబట్టే సెమీస్ వరకు వచ్చిందని అన్నాడు. అయితే, తాము ఈ సందర్భంగా సిసలైన ఆటను బయటకు తీస్తామని తెలిపాడు.

  • Loading...

More Telugu News