: సెన్సార్ బోర్డా... తాలిబన్ గ్రూపా?: విశాల్ భరద్వాజ్ తీవ్ర వ్యాఖ్య


కేంద్ర సెన్సార్ బోర్డుపై బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ విశాల్ భరద్వాజ్ ధ్వజమెత్తారు. సెన్సార్ బోర్డు తాలిబన్ గ్రూపులా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బోర్డు కార్యవర్గాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ సినిమా అంతర్జాతీయ గుర్తింపు దిశగా సాగుతోందని, ఇలాంటి సమయంలో అర్థంపర్థంలేని ఆంక్షలు విధించడం సరికాదని, ప్రభుత్వం కేంద్ర సెన్సార్ బోర్డుపై పరిమితులు విధించాలని భరద్వాజ్ కోరారు. సినిమా అనేది కళ అని, సెన్సార్ బోర్డు సభ్యులు వారి పరిమితులను గుర్తెరగాలని ఆయన పేర్కొన్నారు. ఇటీవలే సెన్సార్ బోర్డు కొన్ని ఇంగ్లీషు, హిందీ పదాలను సినిమాల్లో వాడరాదని స్పష్టం చేయడం బాలీవుడ్ వర్గాలకు ససేమిరా నచ్చలేదు. దానికి తోడు అనుష్క శర్మ 'ఎన్ హెచ్ 10' చిత్రానికి అధిక సంఖ్యలో కత్తెర్లు వేయడం పుండుపై కారం చల్లినట్టయింది. దీంతో, పహ్లాజ్ నిహలానీ నేతృత్వంలోని సెన్సార్ బోర్డు తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News