: తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్... ఉగాది ప్రసంగంలో చంద్రబాబు వ్యాఖ్య
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) తెలుగు జాతి గర్వించదగిన వ్యక్తి అని ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. అనంతవరంలో ఉగాది వేడుకల్లో పాల్లొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకోదగిన వ్యక్తి ఒక్క ఎన్టీఆర్ మాత్రమే అని పునరుద్ఘాటించారు. తెలుగుజాతి కీర్తి నలుదిశలా చాటిన వ్యక్తిగా ఆయనకు తెలుగు ప్రజల మదిలో చెరిగిపోని స్థానముందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాణించగలిగే సత్తా తెలుగు జాతికి ఉందని ఆయన పేర్కొన్నారు.