: ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసిన కివీస్... పదో ఓవర్ లో శామ్యూల్స్, దినేశ్ రాందిన్ ఔట్


బ్యాటింగ్ తో కివీస్ స్టార్ మార్టిన్ గప్టిల్ దంచి కొడితే, అతడి జట్టు బౌలర్ ట్రెంట్ బౌల్ట్ పదుపైన బంతులతో చెలరేగుతున్నాడు. వెరసి విండీస్ కు పరాజయం తప్పేలా లేదు. రెండు, ఆరో ఓవర్లలో రెండు కీలక వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టుకు పదో ఓవర్ లో బౌల్ట్ షాకిచ్చాడు. పదో ఓవర్ తొలి బంతికి శామ్యూల్స్ (27)ను బోల్తా కొట్టించిన బౌల్ట్, ఐదో బంతికి దినేశ్ రాందిన్ ను పెవిలియన్ చేర్చాడు. దీంతో నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన కరిబీయన్ జట్టు భారీ విజయ లక్ష్యం చేరుకునేందుకు ఎదురీదుతోంది. 12 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ 101 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (48) అర్ధ సెంచరీకి చేరువయ్యాడు. అతడికి జతచేరిన జోనాథన్ కార్టర్ (8) ధాటిగా ఆడుతున్నాడు.

  • Loading...

More Telugu News