: పశ్చిమ గోదావరి జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం... ఇద్దరు మహిళలపై దాడి, ఓ మహిళ మృతి, బంగారం చోరీ


ఉగాది పర్వదినాన ఏపీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో విరుచుకుపడ్డ దొంగలు మొత్తం 11 కాసుల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. చాగల్లులో ఓ మహిళపై దాడి చేసిన దోపిడీ దొంగలు ఆమెను హత్య చేశారు. అనంతరం ఆమె వద్దనున్న 9 కాసుల బంగారాన్ని తీసుకెళ్లారు. మరోవైపు అదే జిల్లాలోని చింతలపూడిలో స్వైర విహారం చేసిన దొంగలు మహిళపై దాడి చేసి రెండు కాసుల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దొంగల దాడిలో గాయపడ్డ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు చోరుల కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News