: గన్నవరం చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు... అనంతవరంలో తప్పెటగుళ్ల హోరు


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని పరిధిలోని తుళ్లూరు మండలం అనంతవరంలో ఉగాది వేడుకలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. వేడుకలకు ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. సంప్రదాయ నృత్య రీతులు, డప్పు వాయిద్యాలు, తప్పెటగుళ్లతో కళాకారులు హోరెత్తిస్తున్నారు. ఈ వేడుకల్లో పాలుపంచుకునేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేటి ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరి కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గం మీదుగా అనంతవరం చేరుకోనున్నారు.

  • Loading...

More Telugu News