: జంగిల్ ఆర్మీ క్యాంపుపై ‘ఉగ్ర’ దాడి... పౌరుడి మృతి, జవానుకు గాయాలు
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోమారు దాడికి తెగబడ్డారు. సాంబా సెక్టార్ లోని భారత సైన్యానికి చెందిన జంగిల్ ఆర్మీ క్యాంపుపై గ్రనేడ్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఓ పౌరుడు మృతి చెందగా, ఓ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ఉగ్రవాదుల దాడితో తేరుకున్న భారత సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. ప్రస్తుతం అక్కడ ఇరువర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదుల దాడి, ఎదురు కాల్పుల నేపథ్యంలో జమ్మూ- పఠాన్ కోట్ ల మధ్య జాతీయ రహదారిని సైన్యం మూసివేసింది.