: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్పు... ‘కాళేశ్వరం ప్రాజెక్టు’గా నామకరణం!


తెలంగాణలో అతి పెద్ద ప్రాజెక్టుగా రూపుదిద్దుకోబోతున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరును తెలంగాణ ప్రభుత్వం మార్చేసింది. ఏళ్ల క్రితమే పనులు ప్రారంభమైన ఈ ప్రాజెక్టును ఇకపై కాళేశ్వరం ప్రాజెక్టుగా పిలవనున్నారు. ఈ మేరకు నిన్న సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. వారసత్వంగా దక్కిన ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని తీర్మానించిన ప్రభుత్వం, పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక అన్ని ప్రాజెక్టుల డిజైన్లపై మరోమారు సమగ్ర అధ్యయనం చేయాలని సర్కారు నిర్ణయించింది.

  • Loading...

More Telugu News