: మద్యం మత్తులో యువతి పట్ల కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన... చితకబాదిన స్థానికులు
నెల్లూరు జిల్లా మనుబోలులో ఓ కానిస్టేబుల్ వీపు విమానం మోత మోగింది. జనమంతా ఉగాది సంబరాలకు సిద్ధమవుతున్న తరుణంలో మనుబోలు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న విజయ్ మద్యం మత్తులో మునిగిపోయాడు. అంతటితో ఆగని అతడు మద్యం నిషా తలకెక్కి, ఒంటరిగా వెళుతున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. రక్షించాల్సిన కానిస్టేబులే కీచకుడిగా మారడంతో భయభ్రాంతులకు గురైన బాధిత మహిళ కేకలు వేసింది. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు కానిస్టేబుల్ కు దేహశుద్ధి చేశారు.