: అనంతవరంలో ఏపీ, రవీంద్ర భారతిలో తెలంగాణ... వేర్వేరుగా ఉగాది వేడుకలు
తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు నేడు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరగనున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటికే సంక్రాంతి సంబరాలను వేర్వేరుగా జరుపుకున్న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు... ఉగాది వేడుకలను కూడా వేర్వేరుగానే జరుపుకుంటున్నాయి. హైదరాబాదులోని రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం ఉగాది వేడుకలను జరుపుకుంటోంది. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇక రాజధాని లేక నానా పాట్లు పడుతున్న ఏపీ సర్కారు నవ్యాంధ్ర రాజధానిగా రూపుదిద్దుకోనున్న తుళ్లూరు మండల పరిధిలోని అనంతవరంలో ఉగాది వేడుకలను జరుపుకుంటోంది. ఈ వేడుకలకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హాజరవుతున్నారు.