: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్... వరల్డ్ కప్ చివరి క్వార్టర్ ఫైనల్ ప్రారంభం!
వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా నాలుగో, చివరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆతిథ్య న్యూజిలాండ్ తో వెస్టిండీస్ తలపడుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభించింది. కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ (1) తో కలిసి మార్టిన్ గప్టిల్ (6) ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. లీగ్ దశలో ఆరు మ్యాచ్ లలో నెగ్గి గ్రూప్-ఏలో టాప్ పొజిషన్ దక్కించుకున్న కివీస్ రెట్టించిన ఆత్మ విశ్వాసంతో బరిలో దిగింది. బ్యాట్స్ మెన్ నిలకడ లేమితో ఆరు మ్యాచ్ లలో మూడింటిలో మాత్రమే నెగ్గిన వెస్టిండీస్, చావో రేవో తేల్చుకోనుంది. రెండు ఓవర్లు ముగిసేసరికి కివీస్ 8 పరుగులు చేసింది.