: ఇది తప్పు అని కన్నీళ్లు పెట్టుకున్నాం, కాళ్లు పట్టుకున్నాం... వినలేదు: కేవీపీ


రాజ్యసభలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ... విభజన విధానం సరికాదని ఎన్ని విధాలా చెప్పినా ఫలితం లేకపోయిందన్నారు. చేతులు జోడించి, కన్నీళ్లు పెట్టుకుని, అందరి కాళ్లు పట్టుకుని వేడుకున్నామని, కానీ, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. అదే సమయంలో బీజేపీ సభ్యులు బిల్లును పూర్తిగా సమర్థించి పాసయ్యేట్టు చూశారని తెలిపారు. దాని పర్యవసానమే సవరణ బిల్లు వచ్చిందని, అయితే, ఈ బిల్లును తనకు తెలిసినంతవరకు ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలోనూ, ఎవరూ కోరుకోవడం లేదని పేర్కొన్నారు. చట్ట సవరణ బిల్లుతో ఉపయోగంలేదని, ఏపీకి వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేయాలని కేవీపీ కేంద్రానికి సూచించారు.

  • Loading...

More Telugu News