: ఆ చంద్రుడు రాకముందే ఈ చంద్రుడు నిష్క్రమించాడు!
ఉభయ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఇవాళ సాయంత్రం రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు నిర్వహించారు. నరసింహన్ ఈ వేడుకలకు ఇద్దరు సీఎంలనూ ఆహ్వానించారు. తొలుత విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపారు. కాసేపు అక్కడే గడిపి అనంతరం సెలవు తీసుకున్నారు. దీంతో, ఏపీ సీఎం చంద్రబాబు కూడా వస్తే వారిద్దరూ ఎలా పలకరించుకుంటారో చూద్దామని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. కేసీఆర్ వెళ్లిన కాసేపటికి చంద్రబాబు వచ్చారు. ఆయన కూడా గవర్నర్ దంపతులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఉల్లాసంగా కనిపించారు.