: ధోనీ చెప్పిన ఫిలాసఫీ ఇది!
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన నాయకత్వంలో వన్డే విజయాల సెంచరీ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ తో వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో టీమిండియా సాధించిన విజయం కెప్టెన్ గా ధోనీకి 100వ విక్టరీ. అయినా, ఈ జార్ఖండ్ డైనమైట్ లో కించిత్ గర్వం కూడా కనిపించడం లేదు. పైగా, వన్డే సారథిగా మీ ప్రస్థానం గురించి చెప్పమన్న ఓ మీడియా ప్రతినిధికి తత్వం బోధించాడు. ఇన్నాళ్ల తన అనుభవసారాన్ని మీడియా ముందుంచాడు. క్రికెట్ అనేది జీవితచక్రం వంటిదని, ఎక్కడనుంచి మొదలు పెడతామో అక్కడికే చేరుకుంటామని సెలవిచ్చాడు. ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, క్రికెట్ వాస్తవాన్ని కళ్లముందుంచుతుందని తెలిపాడు. ఇన్నాళ్ల తన అనుభవంలో క్రికెట్ మనిషిని నేలపైకి దింపుతుందని అభిప్రాయపడ్డాడు. ఇక, అందుబాటులో ఉన్న వనరులతో ఎలా నెట్టుకురావాలో భారత జట్టు కెప్టెన్సీ ద్వారా నేర్చుకున్నానని పేర్కొన్నాడు.