: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యోగా క్లాసులు... వారి కుటుంబ సభ్యులకు కూడా!


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యంపై కేంద్రం దృష్టిపెట్టింది. ఏప్రిల్ 1 నుంచి వారికి యోగా క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. ఉద్యోగులకే కాదు, వారి కుటుంబ సభ్యులతోనూ యోగా సాధన చేయిస్తారట. ఈ మేరకు సిబ్బంది మరియు శిక్షణ విభాగం (డీఓపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పనిలేదని, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని డీఓపీటీ తెలిపింది. ఆదివారాలు, ఇతర సెలవులను మినహాయించి మిగతా రోజుల్లో ఈ క్లాసులు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న 31 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యోగా సాధన కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. కేంద్రంలో పగ్గాలు చేపట్టిన బీజేపీ సర్కారు సంప్రదాయ వైద్య విధానాలు, యోగా తదితరాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.

  • Loading...

More Telugu News