: ఓటమితో వన్డేలకు గుడ్ బై చెప్పిన అఫ్రిది, మిస్బా


పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్లు మిస్బావుల్ హక్, షాహిద్ అఫ్రిది వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో ఆసీస్ చేతిలో పాక్ ఓటమిపాలవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ మిస్బా, అఫ్రిది వన్డేలకు వీడ్కోలు పలికారు. మిస్బా జట్టులో నమ్మకమైన బ్యాట్స్ మన్ గా పేరొందగా, అఫ్రిది అటు బ్యాట్ తోనూ, ఇటు బంతితోనూ రాణించి విలువైన ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందాడు. అఫ్రిది కెరీర్లో ఇప్పటివరకు 398 వన్డేలాడి 8064 పరుగులు చేశాడు. 6 సెంచరీలు, 39 ఫిఫ్టీలు ఖాతాలో ఉన్నాయి. అఫ్రిది 395 వికెట్లు తీయడం విశేషం. లెగ్ స్పిన్ తో బ్యాట్స్ మెన్ ను కట్టిపడేసే ఈ పఠాన్ వన్డే కెరీర్ బెస్ట్ బౌలింగ్ గణాంకాలు 7/12. ఇక, మిస్బా విషయానికొస్తే... 162 వన్డేలాడి 5122 పరుగులు చేశాడు. వాటిలో 42 హాఫ్ సెంచరీలున్నాయి.

  • Loading...

More Telugu News