: జెనీలియాకు మళ్లీ ప్రపోజ్ చేశాడు!


బాలీవుడ్ దంపతులు జెనీలియా, రితేశ్ దేశ్ ముఖ్ దంపతులు ఒకరిపై మరొకరు ఎంతో ఆపేక్ష కనబరుస్తారు. పెళ్లికి ముందు, తర్వాత కూడా వారి ప్రేమ చెక్కుచెదరలేదు. గతేడాది వారు తల్లిదండ్రులుగా ప్రమోషన్ కొట్టేసిన సంగతి తెలిసిందే. 2014 నవంబర్ 25న జెనీలియా పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. అదలా ఉంచితే... డిజైనర్ రాఘవేంద్ర రాథోడ్ లాక్మే షోలో తనను కొత్తగా చూపించడంపై రితేశ్ సంతోషం వ్యక్తం చేశాడు. రాథోడ్ డిజైన్ చేసిన దుస్తుల్లో తాను ర్యాంప్ పై ఉన్నప్పటి ఫొటోలను ట్విట్టర్లో పెట్టాడు రితేశ్. దానికి జెనిలీయా ట్విట్టర్లో స్పందించింది. 'మళ్లీ పడిపోయా' అంటూ ట్వీట్ చేసింది. ఆ వెంటనే మనవాడు ప్రపోజ్ చేశాడు. 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అంటూ ట్వీట్ చేశాడు. అదండీ సంగతి! ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని కొన్నాళ్లకే ఎడమొహం పెడమొహంలా తయారయ్యే యువతీయువకులు రితేశ్, జెనీలియా స్పూర్తిగా ప్రేమను జీవితకాలం పండించుకోవచ్చు!

  • Loading...

More Telugu News