: విశ్వభారతి యూనివర్శిటీ చాన్సలర్ గా ప్రధాని మోదీ


ప్రధాని నరేంద్ర మోదీ విశ్వభారతి యూనివర్శిటీకి చాన్సలర్ గా నియమితులయ్యారు. వచ్చే మూడేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చాన్సలర్ పదవి నుంచి తప్పుకోవడంతో మోదీ ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు. వర్శిటీ కార్యనిర్వాహక మండలి గతేడాది జులైలో మోదీ నియామక తీర్మానానికి ఆమోదం తెలిపింది. అనంతరం, ఆ తీర్మానాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు పంపింది. విశ్వభారతికి కేంద్రీయ విశ్వవిద్యాలయ హోదా ఉంది. ప్రధానమంత్రిని చాన్సలర్ గా కలిగి ఉన్న ఏకైక సెంట్రల్ వర్శిటీ ఇదే. కాగా, ప్రస్తుతం విశ్వభారతి యూనివర్శిటీ వైస్ చాన్సలర్ పై ఆర్థిక, పాలనాపరమైన అవకతవకలకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది.

  • Loading...

More Telugu News