: దివాకర్ రెడ్డి చెప్పిందాన్నే మురళీ మోహన్ సాఫ్ట్ గా చెప్పారు


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చే ప్రసక్తే లేదని కొద్ది రోజు క్రితం అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుండబద్ధలు కొట్టి మరీ చెప్పారు. ఇదే విషయాన్ని రాజమండ్రి టీడీపీ ఎంపీ మురళీమోహన్ కొంచెం సాఫ్ట్ గా చెప్పారు. ప్రస్తుత పరిస్థితిలో బీజేపీ ఏది పెడితే అదే తినాలని... బీజేపీని డిమాండ్ చేసే స్థితిలో టీడీపీ లేదని స్పష్టం చేశారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు, బీజేపీకి పూర్తి మెజారిటీ లేదని... టీడీపీపై ఆధారపడి ఉండేదని... అందుకే మనకు కావాల్సినవి అడిగి, సాధించుకునేవారమని చెప్పారు. గతానికి భిన్నంగా, ప్రస్తుతం బీజేపీకి పూర్తి మెజారిటీ ఉందని... అందుకే బీజేపీతో పోట్లాడే పరిస్థితి టీడీపీ ఎంపీలకు లేదని సున్నితంగా తెలిపారు. అయితే, కేంద్ర మంత్రులను ఒప్పించి, రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు వచ్చేలా చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News