: బాలీవుడ్, టాలీవుడ్ రెండూ ముఖ్యమే: కృతిసనన్
తనకు బాలీవుడ్, టాలీవుడ్ రెండూ ముఖ్యమేనని 'వన్' భామ కృతిసనన్ తెలిపింది. ఉత్తరాది, దక్షిణాది సినిమాలను సమన్వయం చేసుకుని కెరీర్ ను కొనసాగిస్తానని ఆమె తెలిపింది. 'హీరోపంటీ' సినిమాతో జాకీష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ సరసన బాలీవుడ్ లో రంగప్రవేశం చేసిన కృతి, 'వన్' సినిమాతో టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు సరసన అరంగేట్రం చేసింది. 'హీరోపంటీ' సినిమా బాలీవుడ్ లో మంచి వసూళ్లు సాధించగా, తెలుగునాట 'వన్' డిజాస్టర్ గా నిలిచింది. బాలీవుడ్, టాలీవుడ్ లో ప్రతిభ ఉన్న నటులు చాలామంది ఉన్నారని చెప్పింది. రెండు పరిశ్రమల్లో పనిచేస్తూ తాను సరైన మార్గంలోనే పయనిస్తున్నానని కృతిసనన్ విశ్వాసం వ్యక్తం చేసింది.