: డ్రోన్లు పరీక్షించేందుకు అమెజాన్.కామ్ కు అనుమతి
వస్తువులను డెలివరీ ఇచ్చే డ్రోన్లను బహిరంగ ప్రదేశాల్లో పరీక్షించుకునేందుకు ఆన్ లైన్ వాణిజ్య పోర్టల్ అమెజాన్.కామ్ కు యూఎస్ ఫెడరల్ రెగ్యులేటర్స్ నుంచి అనుమతి లభించింది. ట్రాఫిక్, ఇతర ఇబ్బందులను అధిగమించే క్రమంలో వాయుమార్గంలో వస్తువులను డెలివరీ చేయాలన్నది అమెజాన్.కామ్ లక్ష్యం. అమెజాన్.కామ్ స్వయంగా అభివృద్ధి చేసిన డ్రోన్ కు గాను అమెజాన్ వ్యాపార విభాగానికి సర్టిఫికెట్ ఇచ్చినట్టు అటు ద ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా తెలిపింది. అయితే, లభించిన అనుమతులు ఒక మోడల్ డ్రోన్ కు మాత్రమే వర్తిస్తాయి. అమెజాన్ అదే మోడల్ ను అభివృద్ధి చేసినా, లేక, మరో మోడల్ ను పరీక్షించాలని చూసినా అందుకు కొత్తగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.